Aug 07,2023 20:35

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలబడాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సునిశితమైన హస్తకళలకు పుట్టినిల్లు భారతదేశమని, అటువంటి కళల్లో ముఖ్యమైంది చేనేత కళ అని పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో పట్టు చీరను మన నేత కళాకారులు రూపొందిస్తే ఆ గొప్పతనాన్ని చూసి ప్రపంచం అబ్బురపడిందన్నారు. ప్రజలంతా విధిగా వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని, చారిత్రక నేపథ్యమున్న చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా తనకు తానుగా అంకితం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.