Oct 23,2023 15:50

ప్రజాశక్తి-రాజమండ్రి : మరో ఐదు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాజమండ్రిలో ఇవాళ టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ కానున్నాయి. ఈ కీలక భేటీకి నారా లోకేష్‌ పవన్‌ కల్యాణ్‌ వంటి అగ్రనేతలు హాజరవుతుండడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమన్వయ కమిటీ సమావేశం కోసం నారా లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ కొద్దిసేపటి కిందటే రాజమండ్రిలోని హౌటల్‌ మంజీరాకు చేరుకున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 12 మంది కమిటీ సభ్యులు హాజరవుతున్నారు. పొత్తు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఉమ్మడి కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలు... తదితర అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు.