పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం రెండు భాగాలుగా రానుందని చిత్ర ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు క్రిష్ కూడా ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ కథనాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్, విక్రమ్జిత విర్క్, నోరా ఫతేహి కీలక పాత్రధారులు. ఎ.ఎంరత్నం నిర్మిస్తున్నారు.