Jan 22,2023 08:27

ప్రపంచ విప్లవకారుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప ప్రేమికుడు చేగువేరా... తన ప్రియురాలు పెద్ద ధనవంతురాలు. తనను విందుకు ఇంటికి పిలిచినప్పుడు..
తన వంటిమీద ఉన్న మాసిన బట్టలను వేసుకుని, చింపిరి గడ్డం, జుట్టుతో ఆపెద్ద బంగ్లాలోనికి వెళ్లి, బట్టలు విడిచి టవల్‌ కట్టుకుని తానే ఆ బట్టలను ఉతికి ఆరబెట్టి తిరిగి వేసుకున్నాడు.
ధనవంతులైన ఆమె తల్లిదండ్రులు ఆయన పేదరికాన్ని చూసి చీదరించుకున్నారు.. అసహ్యించుకున్నారు.
ఆమెను తిట్టి, చివాట్లు పెట్టినా ఏమాత్రం పట్టించుకోలేదు.
కొద్దిసేపటికి చేగువేరా భోజనం చేస్తూ..
ఆమెతోటి జరిపిన సంభాషణను, ప్రపంచపోరాటాలు,
దేశ సమస్యలు, పరిష్కారమార్గాలు, తన కర్తవ్యాలు తెలియచేయడం చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.
తమ కంటే కూతురు ఉన్నతంగా ఆలోచించిదని..
తాము పైకి కనపడే అందాన్ని మాత్రమే చూశాము తప్పా,
తమ కూతురులా లోపలున్న మంచి మనసుని, ఆలోచనల్ని
ప్రేమించలేక పోయామనుకున్నారు.
'ఇతను ప్రపంచాన్నే ఈ విధంగా ప్రేమిస్తే..
తన కూతురిని ఇంకెలా ప్రేమిస్తాడో..!' అని ఆశ్చర్యపోయి, మనసులో ఆనందపడ్డారు.