ప్రజాశక్తి-మంత్రాలయం : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో నూతనంగా నిర్మించిన గోకుల్ విహార్ హోటల్‌ను వైసిపి నాయకులు, ఎమ్మిగనూర్ ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై.సీతారామిరెడ్డి ప్రారంభించారు. గురువారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్లో ఈడిగ రవి కుమార్ గౌడ్, వాల్మీకి అంజి భాగస్తులుగా బాధ్యత నిర్వహణలో చేసిన హౌటల్ గోకుల్ విహార్‌ను వేద మంత్రాల మద్య రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హౌటల్ విజయవంతంగా నడవాలని ఆకాంక్షించారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థమై దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు రుచికరమైన ఫలహారాలు, భోజన సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, మండల ఇంచార్జీ విశ్వనాథ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ గోర్కల్ కృష్ణస్వామి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, నాయకులు శివకుమార్, జనార్దన్ రెడ్డి, వికెసి రఘు, కృష్ణయ్య శెట్టి, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు, శ్రీనివాసభవన్ హోటల్ నిర్వాహకులు మనోజ్, న్యూ రాఘవేంద్ర హోటల్ నిర్వాహకులు ఖాసీం ఫీరా, వార్డు సభ్యులు జగదీష్ స్వామి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










