Oct 27,2023 19:05

వరుణ్‌ తేజ్‌, లావణ్యల వివాహం నవంబర్‌ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. శుక్రవారం పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు ఇటలీకి పయనం అయ్యారు. వీరితో పాటు నిహారిక కొణిదెల కూడా వున్నారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా వరుసగా ఇటలీకి బయలుదేరుతున్నారు. వరుణ్‌, లావణ్య నిశ్చితార్ధం కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో జరిగింది. పెళ్లి మాత్రం ఇటలీలో చెయ్యాలని నిశ్చయించారు. ఈ వివాహానికి దగ్గర కుటుంబ సభ్యులు, కొంతమంది మిత్రులు మాత్రమే హాజరు అవుతారని తెలుస్తోంది. వివాహం అయిన తరువాత హైదరాబాద్‌లో నవంబర్‌ 5న ఒక రెసెప్షన్‌ ఏర్పాటు చెయ్యనున్నారు.