Aug 18,2023 08:59

గురుగ్రామ్‌ : పోలీసులపై దాడి, బెదిరింపుల కేసులో అరెస్టయిన గో గూండా బిట్టూ బజరంగ్‌ అలియాస్‌ రాజ్‌కుమార్‌కు గురువారం నుహ్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఎసిపి ఉషా కుండా ఫిర్యాదు మేరకు నుహ్ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం... 'నల్హార్‌ గుడికి కత్తులు, త్రిశూలాలు తీసుకుని వెళ్తున్న బిట్టూ భజరంగ్‌, అతని మద్దతుదారులను ఎసిపి ఉషా కుండు నేతృత్వంలో పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. బిట్టూ నాయకత్వంలోని మూక పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. చంపుతామని బెదిరించింది. వాహనాల నుంచి ఆయుధాలను కూడా లాక్కుంది'. ఈ నెల 15న ఫరీదాబాద్‌లో బిట్టూను అరెస్టు చేశారు. అప్పటి నుంచి నుహ్ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న బిట్టూను గురువారం నుV్‌ా కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఫరీదాబాద్‌ జిల్లా నీమ్కా జైలుకు తరలించారు. నుV్‌ా మతపరమైన హింసాకాండ కేసులో ఈ నెల ప్రారంభంలో అరెస్టయిన బిట్టూ ఆ తరువాత బెయిల్‌పై ఉన్నాడు.