ఉండుండీ
ఒక్కసారీ దుఃఖ దొంతరల్లోకి
జారిపోతాను.
ఎప్పటికప్పుడు
వ్యూహాలు పదును పెట్టడం
కన్నీటిని చెక్కడం
సుఖమయ ప్రయాణాలుగా మల్చడం.
లోతుగా జీవితాన్ని తరచి చూడటం
తడిమి చూడటం
ఒక లక్ష్యం వైపు దూసుకుపోవటం
నిరంతర శ్రమలోంచి
దారుల్ని వెలిగించటం
తృప్తిని ఆస్వాదిస్తూ అలా
అడుగులు సాగుతుంటాయి .
నిద్రలేని రాత్రుల్ని
గాయం పాడిన గేయం
ఓదార్చుతుంది.
మౌన ప్రపంచంలోంచి లేచి
భావాలు భాషిల్లుతుంటాయి.
ఇక్కడ విషాదమేమిటంటే
పరిగెత్తే వేగానికి
నన్ను నేను సమాధానపరచుకోవడమే.
- గవిడి శ్రీనివాస్
70192 78368