ఈ దట్టమైన అడవిలో
వెదురుగానే నన్ను ఉండిపోనీ
అడవి చెట్ల మీద
కోయిల పాటలు
నన్ను ఆస్వాదించనీ
నిరంతరం వీచే
చిరుగాలి స్పర్శతో
పరవశించి పాడుకోవాలని ఉంది.
వేణువుగా మలచొద్దు
పాటలసలే వద్దు
చప్పట్లు నా మౌనాన్ని
భగం చేస్తాయి.
నా శరీరానికి గాయాలు చేసి
ఆ గాయాలలో నీ ఊపిరి ఊది
నా ఊపిరి తీయకు.
ఎస్.పి.మనోహర్ కుమార్