నా మది ఈ వేళ ఎందుకో
తరలిరాని గత స్మృతుల విహారంలో
మౌన విహంగమై విహారం చేస్తోంది.
కాల యంత్రాన్ని వెనక్కి మళ్లించి
ముద్ద మందారంలాంటి బాల్యంలో
ముద్దుముద్దుగా గడిపిన రోజులు,
సన్నజాజి పరిమళంలాంటి
యవ్వనంలో
స్వేచ్ఛగా విహరించిన రోజుల్లోకి
తిరిగి వెళ్లిపోవాలని ఉంది.
ఎక్కడో కురులు విప్పి
నాట్యమాడుతూ
మనసుమూలల సడిలేని సవ్వడిని
అమాంతం కౌగిలించుకొని
తడి ఆరని జ్ఞాపకాలను
ఒక్కసారి స్పృశించాలని
ఎంతో ఆశగా ఉంది.
నిస్తేజంగా నడుస్తున్న కాలంపై
గతంలో చేజిక్కించుకున్న
విజయాల ఆనవాళ్ళ
చైతన్య కిరణాల పుప్పొడి అద్దాలని ఉంది
ఆ వాసనలు ఎప్పుడూ
నా వెంట ఉండాలని
వేమూరి శ్రీనివాస్
9912128967