
'ఖతర్నాక్', 'రణం' చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన మలయాళ నటుడు బిజుమీనన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'గరుడన్'. అరుణ్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో కేరళ ఆర్మ్‌డ్ పోలీస్ కమాండెంట్ పాత్రలో సురేష్ గోపి నటిస్తుండగా, కాలేజీ ప్రొఫెసర్‌గా బిజు మీనన్ నటిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, జేక్స్ బిజోరు సంగీతం అందిస్తున్నారు.