విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' డిసెంబర్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి ఓ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. దసరా పండుగ సందర్భంగా విశ్వక్ సేన్‌కి సంబంధించిన స్టిల్‌ను రిలీజ్ చేశారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.