అనునిత్యం దాష్టీకాలు
కళ్ళ ముందు కదలాడినా
డబ్బు పెత్తనం ప్రతిభను పాతరేసినా
అహంకారం
మానవతను అణచివేసినా
అజ్ఞానం అభివృద్ధిని అడ్డుకొనినా
స్వార్థం చాపకింద నీరులా విస్తరించినా
అవినీతి వ్యవస్థకే వ్యాధిలా పరిణమించినా
ఉషోదయంపై చీకటి తెరలు విచ్చుకొనినా
హరితారణ్యాన కార్చిచ్చు రగులుకొనినా
మత భూతం కోరలు చాచినా
ఉన్మాదం కౌగిలిలో కబళిస్తున్నా సగటు మనిషి స్పందించే మనసు చేసే ఆక్రందన వినిపించదే?
ఎద వీడి.. భయకుడ్యాల కూల్చి! రణ నినాదమై స్వర గళముల దాటి
నవ్య ప్రభంజనమయ్యేనా?
భావశ్రీ
81065 86997