ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : మెరుగైన విద్యకు మారు పేరుగా జిఎస్‌ఆర్ హై స్కూల్‌ను నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని నేషనల్ విద్యాసంస్థల అధినేత జిఎస్‌ఆర్‌హై స్కూల్ కరెస్పాండెంట్ జి.గోపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదోని పట్టణంలో నేషనల్ విద్యాసంస్థలు నెలకొల్పి పేద విద్యార్థులకు తక్కువ ఫీజులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, అందరి ఆదరాభిమానాలు పొందామన్నారు. స్కూల్‌తో ప్రారంభమై అనతి కాలంలోనే లాభాపేక్ష ఆలోచించకుండా జూనియర్ కాలేజ్ నెలకొల్పడం జరిగిందన్నారు. విద్యారంగంలో తనకంటూ గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంత చిన్నారులకు మెరుగైన విద్యను అందించేందుకు జిఎస్సార్ డే అండ్ రెసిడెన్షియల్ హై స్కూల్‌ను కొత్తగా నెలకొల్పామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రుల కోరిక మేరకు ఆదోనిలోనే రెసిడెన్షియల్ హైస్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థుల అభివృద్ధి మేరకు విద్యను అందిస్తున్నామన్నారు. విశాలమైన మైదానము, ఆధునికమైన సదుపాయాలతో శిల్పా సౌభాగ్య నగర్ లో ఈ ఏడాది నుండే జి ఎస్ ఆర్ డే అండ్ రెసిడెన్షియల్ హైస్కూల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. అనుభవజ్ఞులు, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులచే విద్య బోధన ఇస్తున్నామన్నారు. విద్యార్థుల ఆలోచనలను, సృజనాత్మకతను గమనించి దాని కనుగుణంగానే విద్యా ప్రమాణాలను పెంపొందించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యార్థి సబ్జెక్టు యొక్క నైపుణ్యతను పెంపొందించుటకు పూర్తి వసతులతో కూడిన ఆడియో, విజువల్, ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ మరియు ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. బాల బాలికలకు వేరువేరుగా అన్ని రకములైన సౌకర్యాలతో రుచికరమైన భోజనముతో హాస్టల్ వసతి ఉందన్నారు. విద్యార్థుల శారీరక దృఢత్వానికి గేమ్స్, కరాటే శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. దూర ప్రాంత, గ్రామీణ విద్యార్థులకు బస్సు సౌకర్యము ఉందన్నారు. నర్సరీ నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఉజ్వల భవిష్యత్తు కోసం తమ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు గోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.










