Aug 06,2023 15:36

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : ప్రత్తిపాడు కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో న్యాయవాదులు ఆదివారం ఫ్రెండ్షిప్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు చిట్టంశెట్టి పుల్లయ్య మాట్లాడుతూ న్యాయవాదులు కోర్టు హాల్‌ ఆవరణంలో కేసుల విషయంలోనే ప్రత్యర్థులని బయటకు వస్తే అందరూ స్నేహితులే అన్నారు. సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు కేక్‌ కట్‌ చేసి ఆనందోత్సవాలతో ఫ్రెండ్షిప్‌ డే నిర్వహించారు. కోర్టు సీనియర్‌ న్యాయవాది చల్లంకూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల నూతన బార్‌ అసోసియేషన్‌ ఏర్పడినప్పటి నుండి న్యాయవాదుల మధ్య సమన్వయం మరింత పెరిగిందని, ఇది చాలా శుభ పరిణామం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గన్నారు.