
తుళ్ళింతల తూనీగలు
ఎగిరే సీతాకోకలు
అల్లరి భ్రమరమ్ములు
మనకు ప్రకృతి మిత్రులు!
పువ్వులను చేరి అవీ
సంపర్కం కావించును!
కాయలు, పండ్లను ఇచ్చి
మన కడుపులు నింపును!
మట్టిలో వానపాములు
నేలలో సూక్ష్మజీవులు
క్రిములు, కీటకాదులు
మనకు ప్రకృతి మిత్రులు!
నేలసారం పెంచి అవీ
దిగుబడులును పెంచును!
నాణ్యమైన ధాన్యమిచ్చి
ఆరోగ్యం కలిగించును!
క్రిములను తినే పక్షులు
అక్షింతల పురుగులునూ
బుడి బుడి ఉడతలు, చీమలు
మనకు ప్రకృతి మిత్రులు!
ప్రకృతిలో జీవులన్నీ
మనకు సహజ మిత్రులు కదా!
పర్యావరణం కాపాడుతూ
మిగుల మేలు చేయు గదా!
- రావిపల్లి వాసుదేవరావు,
విజయనగరం,
94417 13136.