Nov 29,2022 15:20

ఇంటర్నెట్‌డెస్క్‌ : మీకు తరచూ తలనొప్పి వస్తుందా? అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరు తీసుకునే ఆహారంలో మెగ్నీషియం లోపించినా మైగ్రేన్‌ తలనొప్పి వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. మెగ్నీషియం ఉన్న పోషకాహారాన్ని తీసుకుంటే.. తలనొప్పి వచ్చే అవకాశాలు తక్కువని, పని ఒత్తిడితో వచ్చినా త్వరగా ఉపశమనం కలుగుతుందని డాక్టర్లు అంటున్నారు.

- రోజూ వ్యాయామంతోపాటు, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, బాదంపప్పు, జీడిపప్పు, అరటిపండ్లు, వేరుశనగపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో భాగంగా మెగ్నీషియం ఉన్న పదార్థాలని తీసుకున్నట్లయితే తలనొప్పిని నివారించుకోవచ్చు.
- మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకున్నా.. తరచూ తలనొప్పి వస్తుంటే.. తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచన మేరకే మెగ్నీషియం సప్లిమెంట్‌ను తీసుకోవాలి.

mg food