Oct 08,2023 11:41

మనలో చాలా మంది యూట్యూబ్‌ వీడియోలను సొంతంగా క్రియేట్‌ చేసి తమ టాలెంట్‌ ఏంటో ప్రపంచానికి చూపుతున్నారు. అయితే కొందరికి ఎడిటింగ్‌ సమస్యల వల్ల చాలా ఇబ్బందిగా ఉంటోంది. దీనికి యూట్యూబ్‌ స్వయంగా గొప్ప సొల్యూషన్‌ తీసుకొచ్చింది. అదే యూట్యూబ్‌ క్రియేట్‌ యాప్‌.
ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.a
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరేమో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు కూడా.. గూగుల్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వీడియో ప్లాట్‌ఫారమ్‌ యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. యూట్యూబ్‌ వీడియో ఎడిటింగ్‌ను మరింత సులభతరం చేస్తూ 'యూట్యూబ్‌ కంటెట్‌ క్రియేట్‌' పేరుతో కొత్త యాప్‌ తెచ్చినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ యాప్‌తో కంటెంట్‌ క్రియెటర్లు తమ ఫోన్లలో వీడియోలను సులభంగా ఎడిట్‌ చేయొచ్చు. ఈ యాప్‌లో కేవలం చిన్న వీడియోలను అడ్జస్ట్‌ చేయడమే కాదు..ఎ1 సాధారణ టూల్స్‌ను వాడి వీడియో ఎడిటింగ్‌ మరింత వేగంగా, సులభంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఈ యాప్‌ రూపొందించినట్లు ఆ కంపెనీ పేర్కొంది. అయితే ఈ వీడియో ఎడిటింగ్‌ యాప్‌ కాన్సెప్ట్‌ కొత్తేమీ కాదు. చైనాకు చెందిన షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ తన వీడియో ఎడిటింగ్‌ యాప్‌ను ముందుగా లాంఛ్‌ చేసింది. ఇప్పుడు గూగుల్‌ కూడా ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతుంది.

ఎలాంటి ఫీచర్లంటే..

ఈ యాప్‌లో వీడియోలను మరింత సులభంగా ఎడిట్‌ చేసుకోవడమే కాదు.. ప్రెసిషన్‌ ఎడిటింగ్‌, ట్రిమ్మింగ్‌, ఆటో క్యాప్షన్‌, వాయిస్‌ ఓవర్‌ ఆప్షన్‌ వంటి టూల్స్‌ ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు అప్లికేషన్‌ ఫిల్టర్లు, ట్రాన్స్‌ఫర్మేషన్లు, ఇంపాక్ట్‌ లైబ్రరీ వంటి ఫీచర్లెన్నో అందుబాటులోకి రానున్నాయి.

ఫ్రీ మ్యూజిక్‌..

దీంతో పాటు రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌, బీట్‌ సింగ్‌ ఫీచర్లు కూడా ఈ యాప్‌లో చేర్చబడ్డాయి. వీటి సహాయంతో ఈ అప్లికేషన్‌ ద్వారా పూర్తి స్థాయిలో వీడియోలను యూజర్లు మరింత ఈజీగా, వేగంగా ఎడిట్‌ చేయొచ్చు.

అందరికీ ఉచితమే..!

ఈ యూట్యూబ్‌ క్రియేట్‌ యాప్‌ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుందని గూగుల్‌ స్పష్టం చేసింది. ఈ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఫోన్లల్లో బీటా వర్షన్లో అందుబాటులో ఉంది. యూట్యూబ్‌ క్రియెట్‌ బీటా వర్షన్‌ ప్రస్తుతం, యుఎస్‌, యుకె, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇండోనేషియా, భారత్‌, కొరియా, సింగపూర్‌తో సహా ఎంపికైన దేశాల్లో అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది యూట్యూ యాప్‌ ఐఓఎస్‌ వర్షన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

పవర్‌ఫుల్‌ ఎ1 టూల్స్‌..

యూట్యూబ్‌ తన వార్షికోత్సవం సందర్భంగా 'మేడ్‌ ఆన్‌ యూట్యూబ్‌' ఈవెంట్‌ సందర్భంగా యూజర్లకు అనేక రకాల ఎ1 పవర్‌ఫుల్‌ టూల్స్‌ను కూడా పరిచయం చేసింది. షార్ట్‌ వీడియోల కోసం ఎ1 రూపొందించిన బ్యాక్‌గ్రౌండ్ల కోసం డ్రీమ్‌ స్క్రీన్‌ వంటి కొన్ని ఎ1 ఆధారిత ఫీచర్లను ఉంటాయని యూట్యూబ్‌ ప్రకటించింది.

డ్రీమ్‌ స్క్రీన్‌..

యూట్యూబ్‌ షార్ట్స్‌ కోసం ఎ1 టూల్స్‌ ఆధారిత ఫీచర్లు అనేకం ఉన్నాయి. మీరు మీ ఐడియాలను అందులో టైప్‌ చేస్తే చాలు.. ఎ1 రూపొందించిన వీడియో లేదా ఇమేజ్‌ బ్యాక్‌ గ్రౌండ్లను వారి షార్ట్‌ వీడియోలకు జోడించడానికి ఇది అనుమతిస్తుంది. డ్రీమ్‌ స్క్రీన్‌తో క్రియేటర్లు తమ షార్ట్స్‌ కోసం కొత్త సెట్టింగులను రూపొందించుకోవచ్చు.