ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ): పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని శ్రీ కేశవ పట్టాభి రామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబులు శంకుస్థాపన చేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పురాతనమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దేవస్థానం నిధులు రూ 10 లక్షలు,సర్వ శ్రేయోనిది రూ 90 లక్షలు వెరసి రూ.కోటి రూపాయల వ్యయంతో పునర్ నిర్మిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గవరసాన సూరిబాబు, ఎంపీపీ పెంకే సత్యవతి, వైస్ ఎంపీపీ మిర్యాల రాజా, సర్పంచ్ దిమ్మల పుష్పరత్నం, ఎంపీటీసీలు నల్లల సూర్య కుమారి, ఉప్పుటీ ప్రసాద్, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, ఆలయ చైర్మన్ మేడిది వెంకట రామారావు, చల్లా చిన్న వీర్రాజు, బిక్కిన శేషవీర కుమారి, పెద్దింటి వెంకట నరసింహాచార్యులు, ఎలిశెట్టి నాని, ఏలేటి సుబ్బారావు, ధర్మకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










