ప్రజాశక్తి-కాజులూరు(కాకినాడ) : కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మంగళవారం ఆయన స్వగ్రామమైన కాజులూరు మండలం దుగ్గుదురు గ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు దోమ్మేటి నివాసం వద్ద రాష్ట్ర సమాచార శాఖ బీసీ సంక్షేమ నమస్కారం మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ చిక్కాల రామచంద్రరావు, అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు వైసిపి, టిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దోమ్మేటి వెంకటేశ్వరు 1987లో కాజులూరు మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అధిరోహించారు. తాళ్లరేవు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడుసార్లు, 1999లో ఇండిపెండెంట్గా ఓసారి పోటీ చేసి ఓటమి చెందారు. 2004లో తాళ్లరేవు నియోజకవర్గ నుండి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం పేదలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వాసుపత్రిలో వుండి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేశారు. 2004 సంవత్సరంలో దోమ్మేటి వెంకటేశ్వరు ఆయనకు భార్య , కుమార్తె, కుమారుడు ఉన్నారు.










