Aug 16,2023 15:29

ప్రజాశక్తి - యానాం(కాకినాడ): మాజీ మేయర్‌ కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు జయంతిని స్థానిక సమాచార శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఫెర్రిరోడ్డులోని ఆయన విగ్రహానికి యానాం పరిపాలనాధికారి మునిస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ అరుల్‌ ప్రగాశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో ఎస్‌పి రఘునాయగం, సీఐ షణ్ముగం, ఎస్‌ఐ శేరు నూకరాజు, రామకృష్ణ, కెఎల్‌వి ప్రసాద్‌, రాజు పాల్గొన్నారు.