Dec 31,2022 12:49

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : ఎన్‌టిఆర్‌ పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం రామిరెడ్డి శ్రీధర్‌ సభ్యులు సంయుక్తంగా నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందం మారేడు వనంలో వివిధ రకాల మామిడి మొక్కలు నాటారు. దేవస్థానం భూములలో మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్‌లో బహుమతులకు బదులు మొక్కలు నాటాలని సూచించారు. పిల్లలకు ఆస్తిపాస్తులతోపాటు వారు ఆనందంగా జీవించటానికి మంచి ప్రకఅతి ని కూడా అందజేయాలని రామిరెడ్డి శ్రీధర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల అధినేత కాపా రవీంధ్ర, శివాలయం అర్చకులు యడవల్లి ప్రసాద్‌ , పూజారి రాజేష్‌ , కాళియ , శ్రీనివాస్‌ , శివాలయం ఉద్యోగి పవన్‌ , లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పబ్బతి నరేంద్ర , మారం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.