Oct 29,2023 10:29

కైరో : ఈజిప్ట్‌ రాజధాని కైరోలో దట్టంగా కమ్మేసిన పొగమంచు 32 మంది ప్రాణాలను బలిగొన్నది. జాతీయ రహదారిపై శనివారం ఉదయం మంచు కారణంగా దృగ్గోచర కాంతి లేకపోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు పరస్పరం ఢకొీన్నాయి. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 63 మంది గాయపడ్డారు. కైరోకు ఉత్తరంగా 160 కిలోమీటర్ల దూరంలో నుబరియా పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత కైరోకు వెళ్తున్న బస్సు హైవేపై ఆగివున్న వాహనంలోకి పాసింజర్‌ బస్సు దూసుకువెళ్లింది. అటుపై పలు వాహనాలు ఢ కొన్నాయని, కొన్ని కార్లు బస్సులోకి దూసుకెళ్లాయని అధికారులు తెలిపారు. పొగ మంచు దట్టంగా వుండడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. మొత్తంగా 29 వాహనాలు ఈ ప్రమాదం బారిన పడ్డాయి. హైవేలపై దట్టంగా పొగమంచు కమ్ముకుంటోందని శుక్రవారమే హైవే అథారిటీ ప్రకటించింది.