Jun 25,2023 14:47

నమక్వాలాండ్‌ దక్షిణాఫ్రికాలోని పశ్చిమ తీరాన విస్తరించి ఉన్న ప్రాంతం. వసంతకాలంలో నమక్వాలాండ్‌ లోయ ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన పిక్నిక్‌, విహారయాత్రల విడిది. కేప్‌ ప్లోరల్‌ కింగ్‌డమ్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశం నమక్వా నేషనల్‌ పార్క్‌, గోగాప్‌ నేచర్‌ రిజర్వ్‌. తూర్పు, పశ్చిమ కేప్‌లోని ఎనిమిది రక్షిత ప్రదేశాల్లో సుమారు పదిలక్షల ఎకరాల విస్తీర్ణంలో పూల వనాలు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి ఆఫ్రికన్‌ ఖండంలో ఇది ఐదు శాతం కన్నా తక్కువ. సముద్ర తీరంలో స్వర్గధామంలా ప్రత్యేకమైన ప్రకృతి వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. చూసినవారెవరైనా అద్భుతః అనక మానరు. ప్రపంచంలో ఉన్న పూల రకాల్లో సగానికిపైగా పూలజాతి మొక్కలు ఇక్కడే కనువిందు చేస్తాయి. జులై నుంచి అక్టోబర్‌ వరకూ ఫ్లవర్‌ సఫారీకి అనుకూలమైన వాతావరణం. కనుచూపు మేరలో నేలంతా రంగు రంగుల అడవి పూలతో పరిమళాలను వెదజల్లుతూ నేలంతా పరిచిన పూల తివాచీలా కనిపిస్తుంది. ఇక్కడ చిత్రాలు చూస్తుంటే మీకూ అలాగే అనిపిస్తోంది కదూ..!

1

 

2

 

3

 

4

 

6

 

7

 

8