
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం టౌన్‌లోని బాలాజీ మార్కెట్ షాపుల్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. బాలాజీ 216 నెంబర్ షాపులో విద్యుత్ బోర్డు దగ్గర మంట రావడంతో షాపులో పని చేస్తున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ మంటలు రాజుకొని మార్కెట్ 216, 217, 218 షాపులు దగ్ధమయ్యాయి. మేడపైన షాపులు కావడంతో కింది షాపులవారు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మంటలు పెరగడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు పెరగడంతో వాటర్ కేన్‌లతో నీటిని కొట్టి మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.
