Aug 10,2023 16:49

ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ) : జార్జి పేట పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా టిడిపి, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గుత్తుల సత్యవేణి గురువారం కోలాహలంగా నామినేషన్‌ దాఖలు చేశారు. జార్జిపేట వేణుగోపాలస్వామి ఆలయం నుంచి టిడిపి శ్రేణులు, పార్టీ కార్యకర్తలు వందలాది మందితో ర్యాలీగా జార్జిపేట పంచాయతీకి తరలివచ్చారు. రిటర్నింగ్‌ అధికారి విద్యాసాగర్‌ కుమార్‌కు ఒక సెట్టు నామినేషన్‌ అందించారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీలపల్లి సర్పంచ్‌ చిట్టూరి నాగమణి, టిడిపి నాయకులు గుత్తుల సూర్యనారాయణ, ధూళిపూడి బాబీ, పెదపాటి కామేశ్వరరావు, కడలి శ్రీనివాస్‌, పెంకె ఏడుకొండలు, మోపురి వెంకటేశ్వరరావు, నీలపల్లి ఎంపిటిసి దంగేటి సూరిబాబు, కొల్లాటి వీరబాబు, జనసేన పార్టీ నాయకులు విళ్ల వీర, సూరిబాబు పలువురు మహిళలు పాల్గొన్నారు.