Jun 15,2023 11:58

ఇంటర్నెట్‌డెస్క్‌ : అంజీరాను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంజీరాలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌లు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి ఉపకరిస్తాయి. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అలాగే అంజీరాలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియకు సహాయపడడమే కాదు.. ప్రేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

- రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అంజీరా సహాయపడుతుంది. వీటిని తీసుకుంటే మూత్రపిండాల సమస్యలు కూడా దరిచేరవు అని వైద్యులు సూచిస్తున్నారు.