Oct 21,2023 12:18

గ్రేటర్‌ నోయిడా : గ్రేటర్‌ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఎకో వ్యాన్‌ నంబర్‌  DL 3 CC 7136ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వ్యానులో ప్రయాణిస్తున్న 8 మందిలో 5గురు ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం జెవార్‌లోని కైలాష్‌ ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వ్యాన్‌లో ఉన్న వారంతా ఢిల్లీ నుంచి జార్ఖండ్  వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. గ్రేటర్‌ నోయిడా నుంచి జేవార్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.