Oct 28,2023 16:15

బెంగాల్‌: వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వారు. కూలీ పనిచేస్తే గానీ పూట గడవని పరిస్థితుల్లో బతుకుతున్నారు. రోజువారీలాగే కూలీ పనికి వెళ్లారు. ఈ క్రమంలో పికప్‌ వ్యాన్‌లో పూలు లోడ్‌ చేస్తున్నారు. పనిలో పూర్తిగా నిమగమయ్యారు. త్వరగా పని చేసుకుని.. కాస్త కడుపు నింపుకుందామని ఆశగా పనిలో బిజీ అయ్యారు. కానీ వారికి పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేకపోయారు. పూలు లోడ్‌ చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన ఓ లారీ వారిని బలంగా ఢ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు మఅతి చెందారు. బంగాల్‌లోని ఖరగ్‌పుర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 'పశ్చిమ మేదినీపుర్‌ జిల్లా.. ఖరగ్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బురమలా వద్ద శనివారం తెల్లవారుజామున 10 నుంచి 12 మంది కార్మికులు కలిసి పికప్‌ వ్యాన్‌లో పూలు లోడింగ్‌ చేస్తున్నారు. అకస్మాత్తుగా సిమెంట్‌ లారీ వెనుక నుంచి వచ్చి వరిని బలంగా ఢ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మఅతి చెందారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండ గా మరణించారు. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకున్నాం. అప్పటికే మఅతి చెందిన ఐదుగురిని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.' అని పోలీసులు తెలిపారు