అల్జీరియా : ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో బుధవారం తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు.. వ్యాన్‌ని ఢకొీట్టడంతో మంటలు చెలరేగి ప్రయాణీకులు అగ్నికి ఆహుతై 34 మంది మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయని అల్జీరియా సివిల్ ప్రొటెక్షన్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో.. అల్జీరియాలోని దక్షిణ ప్రాంతంలోని తమన్‌రాసెట్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ప్రయాణీకులతో ఉన్న బస్సు.. వ్యాన్‌ని ఢకొీట్టింది. దీంతో పేలుడు సంభవించి బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. ఈ ప్రమాదం రాజధానికి 1500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న అల్జీరియన్ సహారాలో ఈ ట్రాఫిక్ ప్రమాదం జరిగిందని సివిల్ ప్రొటెక్షన్ ప్రకటన వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణీకులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సులో అద్రార్, తమన్‌రాసెట్ పట్టణాల మధ్య నివిశిస్తున్న ప్రయాణీకులు ప్రయాణీస్తున్నారని సివిల్ ప్రొటెక్షన్ ప్రకటన పేర్కొంది.
కాగా, ఈ ప్రమాదంపై నేషనల్ జెండర్‌మేరీ డిటెక్టివ్‌లు దర్యాప్తు ప్రారంభించారు. అల్జీరియాలో రోడ్డు ప్రమాదాలకు అతి వేగమే కారణమని నేషనల్ సెంటర్ ఫర్ ప్రివెన్షన్ అండ్ రోడ్ సేఫ్టీ నివేదికలు తెలుపుతున్నాయి. ప్రధానంగా అల్జీరియాలో 90 శాతం కంటే ఎక్కువ ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయి. అలాగే రోడ్లు, కార్లు అధ్వాన్న పరిస్థితిలో ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని నేషనల్ జెండర్‌మేరీ డిటెక్టివ్ ఏజెన్సీ వెల్లడించింది. 2022లో మొత్తం 22,980 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, ఈ ప్రమాదాల్లో 3,400 మందికిపైగా మృతి చెందారని ప్రభుత్వ ఏజెన్సీ హెడ్ నాసెఫ్ అబ్దేల్ హకీమ్ తెలిపారు. కేవలం గత ఏడాదిలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదాల వల్ల దాదాపు 30,400 మంది గాయపడ్డారని హకీప్ తెలిపారు.