ఇంటర్నెట్‌డెస్క్ : చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తేలికపాటి వ్యాయామమైన వాకింగ్‌ని ఎంచుకుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే కొందరు వేగంగా నడిస్తే.. మరికొందరు స్లోగా నడుస్తూ వ్యాయామం చేస్తారు? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాల్నిస్తుందో తెలుసుకుందామా..!
- బరువు తగ్గాలనుకునేవాళ్లకి నడక ఉత్తమమైన మార్గం. మీరు ఫాస్ట్‌గా వాకింగ్ చేసినా.. నడిచినా? స్లోగా జాగింగ్ చేసినా.. ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్లోగా నడుస్తుంటే సరదాగా నడిచినట్లుగా ఉంటుంది. అదే వేగంగా నడిస్తే.. క్యాలరీలు తగ్గి.. అధిక బరువు కూడా తగ్గుతారు.
- నెమ్మదిగా నడవడం వల్ల.. గుండెకు మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే కండరాల పనితీరు మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
- చేతులు కదుపుతూ స్లోగా జాగింగ్ చేయడం వల్ల చేతి కండరాల పనితీరు బాగుంటుంది. జాగింగ్ వల్ల.. ఫిట్‌నెస్‌గా ఉంటారు.
- కీళ్ల సమస్యలున్నవారు, గాయాలైనవారు, వయసు పైబడినవారు వేగంగా నడవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల సమస్యలతో బాధపడేవారు స్పీడుగా నడిస్తే.. బరువు కీళ్లపై పడకుండా.. తేలికగా వ్యాయామం చేసినట్లుగా ఉంటుందట. అందుకే మీ ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని, శరీరానికి తగినట్లుగా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.