కోలీవుడ్ హీరో విజయ్ నటించిన 'లియో' చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను తమిళనాడులోని రోహిణి థియేటర్‌లో గురువారం విడుదల చేశారు. అయితే, ఇది తమ అంచనాలను అందుకోలేకపోవడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఆ థియేటర్‌లోని సీట్లను విరగ్గొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల నిరాశకు గురైన అభిమానులు విధ్వంసం సృష్టించారని కొందరు, థియేటర్ యాజమాన్యం అనుకున్న సమయానికి ట్రైలర్‌ను ప్రదర్శించలేదని అందుకే అభిమానులు ఆగ్రహానికి గురయ్యారని మరికొందరు చెబుతున్నారు. ఈ చిత్రంలో విజరు సరసన త్రిష కథానాయికగా నటించింది.










