Dec 05,2022 16:42
  • ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌

ఖతార్‌ :  ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌ బాల్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చిరకాల ప్రత్యర్థులు ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ దూసుకెళ్లాయి. ప్రీ-క్వార్టర్‌ ఫైనల్‌ నాకౌట్‌ రౌండ్లలో తిరుగులేని విజయాలు సాధించాయి. ఆదివారం జరిగి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ 3-1 గోల్స్‌ తేడాతో పొలాండ్‌పై గెలిచింది. కెయిల్‌ ఎంబాపే రెండు గోల్స్‌ చేశాడు. మరో గోల్‌ను జిరోడ్‌ (44వ నిమిషంలో) సాధించాడు. ఇక పొలాండ్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను ఆ జట్టు కెప్టెన్‌ లెవండోస్కీ పెనాల్టీ రూపంలో సాధించాడు.