May 04,2023 13:15

ప్రజాశక్తి- రేపల్లె (గుంటూరు) : పోటుమెరక గ్రామంలో సర్పంచ్‌ కాగితాల హనుమ ప్రసాద్‌ ఆధ్వర్యంలో కామాక్షి ఐకేర్‌ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్‌ డి వాసుదేవరావు పాల్గొని కంటి పరిక్షలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ పరిక్ష చేసిన వారిలో ఆపరేషన్ల అవసరమైన వారిని గుర్తించి చెరుకుపల్లి కామాక్షి ఐ కేర్‌ హస్పటల్‌లో కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశామన్నారు. శిబిరంలో 120 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 50 మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు. సుమారు 120 మందికి వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కాగితాల సుబ్బారావు, డాక్టర్‌ రాజేష్‌, చుట్టూ పక్క గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

2