May 16,2023 14:39

ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ) : స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపు 8వ రోజుకు చేరుకుంది. సుమారు 200 మంది బాలలు పాల్గొన్న ఈ శిబిరంలో కాకినాడకు చెందిన పిల్లి గోవిందరాజు విద్యార్థులకు స్పాంజీలతో బొమ్మలు తయారు చేయ్యటంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం విద్యార్థులను 15 బృందాలుగా విడదీసి వారితో సింహం, ఆవు, ఇతర జంతువుల రూపాలతో బొమ్మలు తయారు చేయించారు. ఈ శిక్షణ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ శిక్షణా శిబిరంలో పూజిత సూర్యశ్రీ ఆత్మ రక్షణకు సంబంధించిన అంశాలపై కరాటేలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూనిరెడ్డి అరుణ, డి.కృష్ణ, అమృత, నమ్రత, ఐశ్వర్య, జోష్ణ, కూనిరెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు.