అమరావతి : ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఐఏఎస్ అధికారి దంపతులకు గాయాలు అయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు వద్ద మాజీ ఐఏఎస్ అధికారి విజరుకుమార్ దంపతుల వాహనాన్ని లారీ డీ కొట్టింది . దీంతో ఇన్నోవా కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో దంపతులకు స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.










