Feb 04,2023 08:38

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన ప్రతి సినిమాకు అవార్డులు వచ్చాయి. తొలి సినిమా 'ఆత్మగౌరవం'కు నంది అవార్డు వచ్చింది. శంకరాభరణం చిత్రానికి నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. సప్తపది చిత్రానికి 'నర్గీస్‌దత్త్‌ అవార్డు ఫర్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌' అవార్డు వరించింది. స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం చిత్రాలకు ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌లుగా జాతీయ అవార్డులు వచ్చాయి. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తొలి తెలుగుచిత్రంగా 'స్వాతిముత్యం' నిలిచింది.

Every-film-is-prestigious


                                                                   మధురమైన పాటలతో ...

మరపురాని సినిమాలు తీసిన వాటిలో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన పాటలు ఎన్నో ఉన్నాయి. సీతా మహాలక్ష్మి సినిమాలో 'మావిచిగురు తినగానే', స్వాతిముత్యంలో 'సువ్విసువ్వి సువ్వాలమ్మా..' 'మౌనమేలనోయి.. ఈ మరపురాని రేయి', సాగర సంగమంలో 'తకిట తదిమి..', శుభసంకల్పంలో 'సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు..', 'నీలాల కన్నుల్లో సంద్రమే..', స్వర్ణకమలంలో 'ఘల్లు ఘల్లు మంటు..' వంటి పాటలు మళ్లీ మళ్లీ వినాలిపించేవిలా మనసుకు హత్తుకున్నట్లుంటాయి. చిరంజీవి నటించిన స్వయంకృషిలో 'పారాహుషార్‌..', ఆపద్బాంధవుడు చిత్రంలో 'ఔరా అమ్మకుచల్లా..' ఆల్‌టైమ్‌ హిట్స్‌గా నిలుస్తాయి. సిరివెన్నెల, 'విధాత తలపున ప్రభవించినది' స్వాతికిరణంలో ప్రతి పాటా ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి ఉంటాయి.

Every-film-is-prestigious



                                                                      సినీ ప్రముఖుల నివాళి

కె విశ్వనాథ్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. దర్శకులు రాంగోపాల్‌ వర్మ, క్రిష్‌, మాధుర్‌ భండార్కర్‌, రాకేశ్‌ రోషన్‌, యాక్టర్లు చిరంజీవి, కమల్‌హాసన్‌, అనిల్‌ కపూర్‌, మహేశ్‌ బాబు, రామ్‌ పోతినేనితోపాటు విక్రమ్‌, మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, సాయిపల్లవి తమ సంతాపం తెలియజేశారు.



విశ్వనాథ్‌.. తెలుగు దర్శకుడే కాదు, భారతీయ దర్శకుడు కూడా. యువతరానికి ఆయన ఆదర్శం. సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. - నాజర్‌

'విశ్వనాథ్‌.. సమాజానికి ఉపయోగపడే గొప్ప చిత్రాలు తీశారు. బాపు, బాలచంద్ర, విశ్వనాథ్‌ వంటి వారు చరిత్రకారులు - రాఘవేంద్రరావు

ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే.. మాకు కె.విశ్వనాథ్‌ గారు ఉన్నారని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమ మిమ్మల్ని ఎప్పటి మర్చిపోలేదు. సినిమా గ్రామర్‌లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. - ఎస్‌ఎస్‌ రాజమౌళి

భారతదేశంలో అత్యంత ప్రభావశీలుడైన రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ అయిన కె.విశ్వనాథ్‌. ఆయన సినిమాలు చిరకాలం గుర్తుండిపోతాయి. - రాంగోపాల్‌ వర్మ

నేను ఎంతగానో అభిమానించే గొప్ప దర్శకుల్లో విశ్వనాథ్‌ ఒకరు. ఆయన ప్రతి నటుడికి గురువు లాంటి వారు. ఆణిముత్యాల్లాంటి సినిమాలతో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. - అల్లు అర్జున్‌