Jun 07,2023 15:23

ప్రజాశక్తి-కాజులూరు(కాకినాడ) : అర్హులైన ప్రతి రైతుకు కౌలు కార్డు అందించాలని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్‌ చేశారు. బుధవారం కాజులూరు మండలంలో ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని లేదా భూ యజమాని సంతకం తొలగించాలని ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కౌలు రైతులకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రా వ్యాప్తంగా జరుగుతుందని కౌలు రైతు రక్షణ యాత్రలో బాగంగా కాజులూరు మండలంలో గొల్లపాలెం చేదువాడ తిప్పరాజుపాలెం కాజులూరు శీలలంక గ్రామాల్లో ప్రచార జీపు జాత జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్‌ మాట్లాడుతూ.. 2019 సిసిఆర్సి చట్టం కౌలు రైతుల కోసమే అని నమ్మబలికి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం కౌలు రైతులకు నష్టం చేసే విధంగా ఉందని భూమి సాగు చేయని భూ యజమానులకు వరంగా మారిందని అప్పులు చేసి పంటల పండిస్తున్న రైతులకు ఏమి మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారాలన్నీ సొంత భూ యజమానులకు పోతున్నాయని ఈ చట్టాన్ని ఈ చట్టాన్ని సవరించాలని ఈనెల 5వ తేదీ నాలుగు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కౌలు రైతుల రక్షణ యాత్ర ప్రారంభమైందని తెలిపారు. 12వ తేదీన విజయవాడలో జరిగే పాదయాత్రలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్ర జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.బాలకృష్ణ, ఈశ్వరరావు, అల్లాడి నరసింహమూర్తి, పెనుమల ఎక్స్‌ సర్పంచ్‌ వనం వీరబ్రహ్మం, కురుపూడి రాంబాబు, గంజా అప్పారావు, చింతపల్లి లోవరాజు, పెంకె శ్రీనివాస్‌, ఎక్స్‌ సర్పంచ్‌ పెంకే సూర్యనారాయణ కౌలు రైతులు పాల్గొన్నారు.