Aug 02,2023 10:40
  • ఆదాయం 5,579 కోట్లు
  • ఖర్చు 19 వేల కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ లోటుతో ఉన్న ఖజానా రెండో త్రైమాసికంలో కూడా అదే దిశగా సాగుతోంది. జులై నెలలో ఏకంగా 13,500 కోట్ల వరకు లోటు తేలింది. ఈ నెలలో ఆదాయం కేవలం రూ. 5,579 కోట్లు కాగా, వ్యయం మాత్రం 19 వేల కోట్లకు చేరిపోయింది. దీంతో ఈ లోటు మొత్తాన్ని రుణాల రూపంలో తీసుకున్న నగదు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లుతో భర్తీ చేసుకున్నారు. కాగా మొత్తం నాలుగు నెలల్లో లోటు దగ్గరదగ్గరగా 64 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు తేలింది.