ఈ జగం ఒక దృశ్యాదృశ్య తెర
ఇది లోకాలోకాల పొలిమేర
రివైండ్ కానీ మొండి మర
నిన్నటి చరిత్రల జ్ఞాపకాల దొంతర
మనిషి బ్రతుకు గాలి బూర
ఆయువును దాచని అలమర
ఆడుతున్న ఊపిరి మర
కథ క్రమంలో ఎప్పుడు ఆగుతుందో
తెలియని ఊపిరి బూర
ఆగితే ఊపిరి ఊదలేడే దొర!
ఆలకించదు ఈ మర ఎవరి మొర
దిగితే ఎవడెత్తలేని తెర
ఎత్తిన వాడే దించును పో!
మాలో మార్కండేయులు లేరా
వినరావా మా మొర
ఒక్కసారి రావా ఓ దేవరా!
కనిపించని ఈ మాయ తెర
ఎవడెత్తగలడు?
ఎత్త లేని తెర ఎత్త రావా!
పి. బక్కారెడ్డి, 9705315250