Sep 25,2022 08:52

మతోన్మాద శక్తులే
దేశాన్ని పాలిస్తున్నారు
నిరంకుశ మూకలే
జాతిని శాసిస్తున్నరు
అధికార పీఠం ధ్యేయంగా...
విష రాజకీయం చేస్తున్నరు
గుత్తాధిపత్యం లక్ష్యంగా...
అణిచివేతకు తెగబడ్తున్నరు

హిందుత్వం ఎజెండాగా ...
లౌకికతను పాతరేస్తున్నరు
కాసాయీకరణ ఆశయంగా ..
(కసాయీకరణ/కాషాయీకరణ)
విద్వేషాగ్నులు రాజేస్తున్నరు
జాతి భద్రత మాటున...
నల్ల చట్టాలు సంధిస్తున్నారు
దేశ నిర్మాణం పేరిట ...
బతుకులు కూలదోస్తున్నరు

సంక్షేమ గీతం పల్లవిస్తూనే
అరాచకాలకు తెగబడుతున్నారు
ప్రగతి మంత్రం జపిస్తూనే
దారిద్య్రంలోకి నెట్టేస్తున్నరు

కలాలకు సంకెళ్లు
గళాలకు ఉరితాళ్లు
హక్కులకు ఉక్కుపాదాలు
ఊపిరిలపై నిషేధాజ్ఞలు
పిడికిళ్లపై విద్రోహముద్రలు
ఇదే కదా నేటి పాలక తీరు

ఎగిరే ఎర్ర జెండా సాక్షిగా
ఇక సకల జనం సంఘటితమై
మతోన్మాద కోటలు కూల్చాల్సిందే
నియంత పాలకులను
కడ తేర్చాల్సిందే

కోడిగూటి తిరుపతి
95739 29493