సుస్థిరమైన రేపటికోసం..
స్త్రీ పురుష సమానత కావాలి..
ఇతిహాసపు కూతలనెదిరిస్తూ
సమానత్వం కోసం కదలాలి
అందరికీ అన్నీ అందేరోజు రావాలి..
అదే సమానత కావాలి..
ఏకరూపత పౌరస్మృతులు ఎన్ని చెప్పినా..
మహిళలకు కావాల్సింది సమానతే..
పర్సనల్, హిందూ చట్టాల్లో..
లౌకిక విషయాల్లోనూ
స్త్రీ పురుష సమానత కావాలి..
పిల్లల పుట్టుక, లింగ తేడాతో..
స్త్రీతోనే బంధం తెంచుకోవటం..
ఏవిధమైన సమానతో చెప్పాలి..
ప్రశ్నించడానికి, గొంతెత్తడానికి
లింగభేదాలెందుకు?
నేటికీ ఇవ్వలేని 33 రిజర్వేషన్లు
చట్టసభల్లో స్త్రీలకూ కావాలి సమానత
పుట్టుకలోనే వివక్ష
పిండంగా చంపడానికి వెనుకాడరు
నిష్పత్తుల్లో సమతుల్యత కోల్పోయాం.
మనుగడే ప్రమాదంలో పడింది
సమానతే అందుకు పరిష్కారం
మతం, కులం అంతంకావాలి..
అంతరాలు తొలగే సమానత కావాలి..
పీడిత జాతికి విముక్తి కలిగితేనే..
కారుచీకట్లో కాంతి రేఖలు ప్రసరించేది..
అందుకోసం..
అందరం చేయి చేయీ కలపాలి..
సహకారంతోనే సమానత సాధించాలి..
శాంతిశ్రీ
83338 18985