Nov 13,2023 12:57

అనగనగా ఒక ఊరిలో కార్తీక్‌, స్వామినాయుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు పర్యావరణం పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవారు. ప్రకృతిని ఎంతో హాయిగా ఆస్వాదిస్తూ వారి పనులు చేసుకునేవారు. వారిద్దరూ తమ కుటుంబాలతో ఆనందంగా ఉండేవారు.
ఒకరోజు ఒకతను పాలిథిన్‌ కవర్‌ని బయటపడేసాడు. దానిని వారిద్దరూ గమనించారు. ఆ పాలిథిన్‌ కవర్‌ని ఒక ఆవు తినేయడం చూశారు. అప్పుడు వారిద్దరూ అతనికి ప్లాస్టిక్‌ వలన కలిగే నష్టాల గురించి వివరించారు. అప్పుడు అతని చేతికి ఒక కాగితపు సంచి ఇచ్చారు. ఇక నుంచి ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించమని సూచించారు.
అప్పటి నుంచి ఆ గ్రామంలో ఒక మార్పు వచ్చింది. ఆ ఊరిలో ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించి, కాగితపు / జనపనార వంటి సంచులు వినియోగించడం ప్రారంభించారు.
ఆ గ్రామాన్ని చూసి మరికొన్ని గ్రామాలు కూడా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాయి.
సంకల్ప బలం ఎంతో గొప్పది. ఆ సంకల్పం ఉంటే మనుషులు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ఆ గ్రామంలో కార్తీక్‌, స్వామినాయుడు వల్ల కొన్ని గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించ సాగారు.
ఇలా ఈ ప్లాస్టిక్‌ భూతం నుంచి మన భూమిని కాపాడారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలి. ఇలా మరికొంత మందికి దానివల్ల వచ్చే నష్టాన్ని వివరించాలి. ఇలా ప్రతీ గ్రామంలో ఈ ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం వలన మన భూమాతని మనం కాపాడుకున్న వారమవుతాం. మీరు కూడా మీకు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.

ఎం. విజయలక్ష్మి
8వ తరగతి
యంపియుపి స్కూలు,
కె.పాలవలస, విజయనగరం.