Sep 17,2023 08:32

ఆదిగదిగో మనదేశ సంతలో
మానవ పశువుల్నికొనే ..
ఓటు ఓటిఅవస్థ ముంచుకొస్తుంది !
గతమంతా తవ్విపోస్తే ఈ తరహా జాతర్లే
వ్యక్తి యుగ యుగాల అణచివేత మోసుకుంటూ
శక్తిగా ఎదగకపోతే తప్పు ఎవరిది ?
ఆ మ్నుప్పు ఎవరికి ?
ఇన్నాళ్ళు నెత్తిమీద కన్నులున్న నాయకులు
ప్రతి వ్యక్తి నెత్తిపై సమస్యల పర్వతాల్ని పెట్టి
మోయిస్తూ పరుగులెట్టించారు
ఇది ఓటు.. అమ్మకు రోజూ ఇల్లు కట్టే పాత పాటే
ఎన్నికల వ్యాపారంలో అధికార దాహంతో
జనమేకల మందల్ని కబేళాకు
కౌగిలింతల కపటంతో తోలి.. నెట్టు కోచ్చేశారు !!
నోటికీ చేతికీ దూరం పెంచే నిరుద్యోగంతో
వ్యాపార పులుల రక్తదాహార్తితో
పెట్టుబడిదారీ చుట్టాల నాయకులు
సహజవనరుల్ని
అయిన వారందరికీ అందివేతలతో
హామీల పూగుత్తులూ అంట కత్తెర్ల దించి
అనుచితాలన్నీ ఉచితాలుగా ప్రలోభపెట్టి
ఎండుటాకులు అందిస్తూ వచ్చారు!
గుండెలు మండుతున్నా ఆ మంటల్ని
కారే కన్నీరు.. మరిగే నెత్తురు ఆర్పలేవు!
గతాన్ని పట్టుపట్టి గట్టిగా చెరిపేయగలవు
భవితను దివ్యంగా పండించగలరు
వర్తమానంతో పోరాడి గెలుపొంది జనగణమన మన జాతీయ గీతి మార్మోగించగలరు !
పార్టీల అభీష్టంలో సమర్థులు
అగ్రకులాల వారే
ఓట్లన్నీ మనవే అయినప్పడు
సీట్లు మనవే కావాలి కదా !
అలా ఎప్పుడూ లేదు మరి!
ఇక మహిళా రిజర్వేషన్‌ మాటలకే పరిమితం
అలా అలా అగ్రకులాల పల్లకీ మోసే
బోయీలుగా మిగిలారు
తన సమూహ దోపిడీదారుల దోసిళ్లలో నేరగాళ్ళ పిడికిళ్లలో..
నియంతత్వ పాలన రూపాంతరాలైనవి
ఎన్నికలలు ఎన్నెన్నో చీకట్లో కలిసినవి !
యిన్నాళ్ళుగా ఓటమిని చవిచూసిన
సందర్భాన్ని నేడు మనం జయించాలి
ప్రస్తుతానికి అష్టైశ్వర్యాలు అక్కర్లేదు
కానీ.. కూడు గూడు ఉపాధి సమన్యాయం కొరత లేకుంటే చాలు! అదే పదివేల మేలు!

యల్‌. రాజా గణేష్‌
9247483700