ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కర్నూలు ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో జిల్లా జేఏసీ ఛైర్మన్ గిరి కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 83 రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపట్టామని ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అలాగే ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితిని గాని కల్పించకుండా సామరస్య పూర్వక వాతావరణంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ తీరు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొల్పిందని భవిష్యత్తులో ఉద్యోగులు నాయకత్వాన్ని ఒత్తిడి చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే జరుగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలియజేశారు.అంతేకాకుండా ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు అన్నీ కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించామని భవిష్యత్తులో మిగిలి ఉన్నది ''సమ్మె'' మాత్రమేనని ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకునేటటువంటి నిర్ణయానికి జరుగు పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మెమోరాండం లో ఉన్నటువంటి అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాసంఘాలు అన్నీ కలిపి ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలిచి ఉద్యమాన్ని ఉదతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .ఈ కార్యక్రమాన్ని ఏపీ జెఎసి అమరావతి జిల్లా నాయకులు రామానాయుడు, వెంకట్ రెడ్డి (మునిసిపల్ టీచర్స్ ఫెడరేషన్ ), ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్, నాగేశ్వరరావు , వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్, అనిష్ లక్ష్మణ్ ఏపీజేఏసీ సంఘ సభ్యులు మరియు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏపీఎస్‌ఆర్టీసీ ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఏపీ ఏపీఎస్‌ఆర్టీసి జిల్లాలో ఉన్న డిపోల సిబ్బంది పాల్గొన్నారు.










