Apr 28,2023 13:00

రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం మండల పరిషత్‌ నిధులతో మండల కేంద్రం మెయిన్‌ సెంటర్‌ ఊర చెరువు సమీపంలో ఉన్న బోరు పూడిపోయి నీటి ఎద్దడి రాగా శుక్రవారం నూతనంగా బోర్‌ వేశారు. మంచినీటి సమస్య పరిష్కారానికి ఎంపీపీ రామినేని దేవిప్రవిణ్య వీరస్వామినాయుడు కృషితో వైస్‌ ఎంపీపీ చాట్ల రాబర్ట్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... మంచినీటి ఎద్దడి నివారణలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మల్లాది రాణి, రెడ్డిగూడెం ఎంపీటీసీ సభ్యుడు కుప్పిరెడ్డి వరప్రసాద్‌ రెడ్డి, భరత్‌ కుమార్‌ రెడ్డి, ఎంపిడిఓ పి శంకరరావు, ఆర్‌డబ్ల్యు ఎస్‌.రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.