Apr 18,2023 17:27

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : దళిత వాడల్లో క్రీడమైన క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మండల కో ఆప్షన్‌ సభ్యులు జగటాల కోట సత్తిబాబు పేర్కొన్నారు. మంగళవారం అల్లిపూడి గ్రామంలో దళిత వాడలో ఉన్న షటిల్‌ కోర్టును సత్తిబాబు సొంత నిధులతో బాగు చేయించారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ.. కోటనందూరు మండల పరిధిలో దళితవాడలో 15 ఉన్నాయని, ఆయా గ్రామాల్లో వాలీబాల్‌, షటిల్‌, కబడి క్రీడలను ఎక్కువగా ఆడతారన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న క్రీడా మైదానాలకు అభివృద్ధి పరచడానికి స్థానిక మండల పరిషత్‌ అధ్యక్షుడు ఎల్‌.శ్రీనివాస్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకువెళ్లి క్రీడ మైదానాల అభివృద్ధికి నిధులు కేటాయించే విధంగా చర్యలు పడతామని క్రీడాకారులకు ఆయన హామీ ఇచ్చారు.