ఇంటర్నెట్‌డెస్క్ : ప్రతిరోజూ పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నానబెట్టిన నట్స్‌ని ఉదయం పొద్దున్నే తిని ఆ తర్వాత నీరు కాని..టీ, కాఫీలు కాని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
బాదంపప్పు : కొన్ని బాదంపప్పులను రాత్రి నీటిలో నానబెట్టుకుని ఉదయం వాటిని తీసుకోవాలి. నానిన బాదంలో విటమిన్ ఇ, బి6 ఉంటాయి. ఇవి మెదడు కణాలలో ప్రోటీన్లను గ్రహించడంలో సహాయపడతాయి. బాదంపప్పులోని ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఎండుద్రాక్ష : నలుపు ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎండుద్రాక్షను నానబెట్టిన వాటిని తీసుకుంటే జుట్టు ఊడిపోవడం వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
వాల్‌నట్స్ : అరకప్పు నీటిలో రెండు వాల్‌నట్స్‌ని నానబెట్టి ఉదయం తీసుకుంటే.. మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇవి జ్ఞాపకశక్తి పెరిగేందుకు సహాయపడతాయి.
అత్తిపండ్లు : రెండు అత్తిపండ్లను రాత్రి నానబెట్టి పొద్దున తీసుకుంటే అజీర్తి సమస్యలను నివారించుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.