పోర్ట్‌బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్పంగా భూమి కంపించింది. రాజధాని పోర్ట్‌బెయిర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 11.56 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. పోర్ట్‌బ్లెయిర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది. భూ అంతర్భాగంలో 28 కిలోమీటర్ల లోతున ప్రకంపణలు వచ్చాయని వెల్లడించింది.