Dec 14,2022 18:46

చెన్నయ్ : ప్రఖ్యాత వయొలిన్‌ విద్వాంసురాలు, సంగీత శిఖామణి ద్వారం మంగతాయారు (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మంగతాయారు దిగ్గజ వయొలిన్‌ విద్వాంసుడు పద్మశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడి పెద్ద కుమార్తె. వీరి స్వస్థలం విజయనగరం. మంగతాయారు బాల్యమంతా విజయనగరంలోనే గడిపారు. ఆ తర్వాత చెనురులో స్థిరపడ్డారు. ఆకాశవాణి సంగీత కార్యక్రమాల్లో పాల్గనడంతో పాటు పలు సంగీత కళాశాలల్లో ఆమె వయొలిన్‌ గురువుగా పనిచేశారు. దేశ, విదేశాల్లో అనేక చోట్ల సంగీత కచేరీలు నిర్వహించి తన నాదోపన్యాసంతో సంగీత ప్రియులను దశాబ్దాల పాటు అలరించారు. ద్వారం కుటుంబం మొత్తం శాస్త్రీయ సంగీత ప్రపంచానికే అంకితమైన అరుదైన గుర్తింపు పొందింది. సంగీతానిు జీవిత భాగస్వామిగా భావించిన మంగతాయారు వివాహం చేసుకోలేదు. ఆమె మృతి పట్ల సంగీతాభిమానులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.